STORYMIRROR

Praveena Monangi

Classics

4  

Praveena Monangi

Classics

ధ్వని

ధ్వని

1 min
615

అమ్మా! అన్న పిలుపులోని 

మాధుర్యం చెవులకి వినసొంపుగా

పసిపిల్లల చిరునవ్వుల గలగలలు

ఘల్లు ఘల్లు మంటున్న మువ్వల 

సవ్వడి హృదయ వీణను మీటగా

పక్షుల కిలకిల రావాలతో మది పులకించగా

మంగళ వాయిద్యాలు మిన్నంటిన తరుణాన 

దేవదేవుల ఆశీర్వచనాలతో మది ఉప్పొంగగా 

అనంత పారవశ్యంలో వెలువడిన 

కీర్తనల ధ్వని తరంగాలు చెవులకు 

చేరినప్పుడు కదా! నిజమైన పారవశ్యం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics