STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Classics

4  

స్వాతి సూర్యదేవర

Classics

చెలీ నినుచూడగానే

చెలీ నినుచూడగానే

1 min
558

చెలీ నిను చూడగానే!!

ఏదో మాయ చుట్టేసింది అలలా!

ఎన్నో మాటలు చెప్పింది ఇలా!

నీ నవ్వులో బ్రతకమని!

నీ అడుగులో నడవమని!

నీ శ్వాసలో జీవించమని!

నీ హృదయంలో చోటు పొందమని!

నీ గుండెలపై సూత్రంలా చేరమని!

నీ పాపిట సింధూరం లా వెలగమని!

నీ చేతి గాజుల్లా మెరవమని!

నీ కాలి మెట్టెల్లా సవ్వడి చెయ్యమని!

నీ ఐదోతనంలో నన్ను క్షేమంగా జీవించమని! 

చుట్టూ వినిపిస్తున్న వేదమంత్రాల నడుమ 

మన మనసుల్ని ముడి వేసింది!.

నిన్ను నా దాన్ని చేసింది!.

నా ఇంటి కి మహారాణి ని చేసింది!.

కడవరకు విడిపోకుండా ఒకే ప్రాణంగా బ్రతకమని 

నిన్ను నా జీవిత భాగస్వామిని చేసింది!.

క్షణం వరకు నా అనుకున్నదంతా ....

ఈ క్షణం నుండి మన అనుకోమని మరి మరి చెప్పింది,

పెళ్లి అనే ఈ పవిత్రమైన బంధం!!.



Rate this content
Log in

Similar telugu poem from Classics