STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Tragedy Classics Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Tragedy Classics Inspirational

బంధాల సంకెళ్లు

బంధాల సంకెళ్లు

1 min
306

మౌనంగా ఏవేవో అనుకుంటుంది.

ఎంతో ధైర్యం నూరిపోస్తుంది.

నీ వేదన నీకు భారం అవుతున్న వేళ,

నీ మనసు ముక్కలవుతున్న వేళ,

నీ ఉనికి నీకు దూరమవుతున్న వేళ,

నీ ఆశలు ఆవిరి అవుతున్న వేళ,

నీ గమనం కనుమరుగవుతున్న వేళ,

మౌనం సరికాదు నీ గొంతు విప్పు...

నీ హక్కులకై పోరాడు,

నీ ఆశయాలకై ఎదురుతిరుగు,

నీ భవిష్యత్తుకి సమాధి కట్టకు,

అని ఎన్నోన్నో చెప్తుంది.

కానీ, అవన్నీ గొంతులోని చంపేసింది

నా మగువ మనసు.

మౌనం సరికాదని నా మది పొరుపెడుతున్నా ,

నేను లేనిది నా చుట్టూ ఉన్న వీరేవరు బ్రతకలేరన్న 

వాస్తవం ఎరిగి మౌనంగా మిన్నకుండిపోయింది.

కానీ, నా గుండెల్లో ధైర్యం

"నీ వెనుక నేనున్నా!" అంటూ ముందడుగు నాతో వేయించింది.

రాలిపోతున్న నా ఆశలకి కొత్త ఊపిరి పోసింది.

ఆత్మస్థైర్యంతో బంధాల  సంకెళ్లు తెంచి గమనాన్ని సాగించమంది.



Rate this content
Log in

Similar telugu poem from Tragedy