STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Romance

4  

స్వాతి సూర్యదేవర

Romance

ఈ రేయి తీయనిది

ఈ రేయి తీయనిది

1 min
420

చల్లగా..  వీచే పిల్లగాలి తెమ్మెరలు మదిని హాయి గొలపగా..!

మెల్లగా తాకిన విరాజాజుల పరిమళాలు మత్తుగా ఉయ్యాలలూపగా..!

కొమ్మలమాటున  పండు వెన్నెలలు నా దేవి జాడ తెలుపగా..!

కొంగుమాటున ఆమె పసిడి సోయగాలు రా...రమ్మని కవ్వించగా..!

నల్లని ఆమె సిగనిండుగా తెల్లని మల్లెలు  విరియగా..!

రమ్యమైన ఈ ప్రకృతి శోభలో....రసరమ్యమైన నా దేవి ఆహ్వానం తెలుపగా..!

ఇంకేమి కావాలి ఈ రేయిని మధురమైనది చేసుకోవడానికి..,

అందమైన జ్ఞాపకంగా మలచుకోవడానికి.

                          💝💝💝💝💝


Rate this content
Log in

Similar telugu poem from Romance