STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Classics Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Classics Inspirational

నీ స్నేహం

నీ స్నేహం

1 min
4

లాభం కోసం కాదు ...,

లాలన కోసం స్నేహాన్ని ఎంచుకో...

బాధల కోసం కాదు...,

బాధ్యతగా స్నేహాన్ని ఎంచుకో...

మాటకారిగా కాదు ....,

మమతలని పెంచుకోవడానికి స్నేహాన్ని ఎంచుకో...

వెన్నుపోటుకి కాదు..., 

వెన్నంటే నడవడానికి స్నేహాన్ని ఎంచుకో...

అవకాశం కోసం కాదు...,

నలుగురికి ఆదర్శంగా నీ స్నేహాన్ని ఎంచుకో..

అవరోధాలకి కాదు...,

అడ్డంకులని అధిగమించే దైర్యంగా నీ స్నేహాన్ని ఎంచుకో...

మొహం చాటేసేలా కాదు...,

ముందడుగు వేయడంలో దారి చూపే స్నేహాన్ని ఎంచుకో...

స్నేహం ఒక నమ్మకం!

స్నేహం ఒక అభయం!

స్నేహం ఒక విడదీయలేని బంధం!

స్నేహం ఒక ప్రోత్సాహం!

స్నేహం జీవితంలో ఒక భాగం!

నమ్మకమైన స్నేహాన్ని వంచించిననాడు...

జీవం ఉంటుందేమో కానీ..

మనిషిగా నీవు మరణించినట్టే!!



Rate this content
Log in

Similar telugu poem from Classics