STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Inspirational

అక్షర సత్యాలు

అక్షర సత్యాలు

1 min
446

కురిసే నవ్వులన్ని వెన్నెలలు కావు!

విషపు నవ్వులు పెదవిమాటున దాగుంటాయి చూడు!!

కలిపే చేతులన్నినేస్తాలు కావు!

పడదోసే ఆలోచన ముసుగు ఉంటుంది చూసుకో!!

పొగడ్తలు అన్నినిజం కావు!

అవి పడగనీడన ఉన్న నిచ్చెనలు మేలుకో!!

ఆహ్వానాలు అన్ని అవకాశాలు కావు!

అడుసులో తోసే ఆలోచనలేమో కాచుకో!!

ఇష్టంగా చేసే ఎంత కష్టమైన ఆనందాన్ని ఇస్తుంది!!

కష్టంగా చేసే తేలికైన పనైనా భాదనే మిగిలుస్తుంది!!

నీ అవసరం ఉన్న చోట మొహం చాటకు..!

ఇప్పుడు లేకున్నా,నీక్కూడా ఆ అవసరం వచ్చేరోజు ఒకటుంటుంది!!

నోరుజారిన మాటలకి అవతల మనిషి భాధ తెలియదు!

ఎందుకంటే విరిగిన మనసుని అవి చూడలేవు!!

పొదుపైన మాట మనిషి ఎదుగుదలకు తోడ్పాటునిస్తుంది! 

నలుగురికి ఆదర్శంగా చూపిస్తుంది!!.


              ★★★★★


Rate this content
Log in

Similar telugu poem from Inspirational