STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మా పల్లెటూరు.

మా పల్లెటూరు.

1 min
212

-----------------------------


మనసున్న మనుషులు

మసలుతూ వున్న మంచితనముకు పుట్టిల్లు మా పల్లెటూరు.


అత్త మామ యనుచు, అన్న, పిన్ని యనుచు బంధుత్వములతోడ

బ్రతుకును పండించు మా పల్లెటూరు.


కష్ట సుఖములన్ని కలబోసుకుంటూ

ఒకరికొకరు తోడుగా

నొదిగిపోయి పిల్ల పాపల తోడ చల్లగా విలసిల్లు మా పల్లెటూరు.


కులము గొప్ప లేదు మత మౌడ్యములు లేవు 

కుమ్ములాటలు లేవు గుద్దులాటలు లేవు కొసరి కొసరి కూరిమిని పంచెడి మా పల్లెటూరు.


ఊరి మేలుకొఱకు ఒక్కడూరేగును

ఒక్కని కొఱకు ఊరు నిలుచుండును.

మంది కోసము మనమన్నమాటనే నమ్మిన మా పల్లెటూరు.


ఒక ఇంట పెళ్ళికి ఊరివారే తోడు

ఒకయింట చావుకి ఊరి వారే తోడు

వెన్ను దన్నుగవుండి వేడుకలో వేదనలో

ధైర్యంబు కురిపించు

కన్నతల్లే మా పల్లెటూరు.


విద్యలేక పోయినా వినయంబు తో మెలగి

పెద్దలను సేవించి ప్రేమతో కాచుకొని 

,పుట్టిన గడ్డకు పేరు నిలబెట్టు సాధు జనులతో నిండి సంబరమ్ములతో చెలగు

సాంప్రదాయము

నుద్ధరించు మా పల్లెటూరు.

  

పచ్చ పచ్చని పొలములు 

బంగారు పంటలు

చెంగు చెంగున దూకు చిన్న తువ్వాయిలు

పాడి పంటలతో పల్లె పదములతో

ఇంటింట కురిసిన ధాన్యరాసులతో అన్నదాతల కొలువు

అవనికే వెలుగు మా పల్లెటూరు.

---------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics