STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మంచిబుద్ధినీయుమా!

మంచిబుద్ధినీయుమా!

1 min
303


ధ్రువకోకిల.(పద్య మాలిక )


కుదురు లేని మనంబు వెఱ్ఱిగ గుప్పిగంతులు వేయుచున్ 

మదము తో చెడుదారి బట్టెను మంచియన్నది వీడుచున్ 

వదల నైతిని వాంఛలన్నియు వాసనల్ బెనవేయగా 

ముదిమి తోడ బలంబు తగ్గెను మోసపోయితి నక్కటా!

పరమ యోగులు తెల్పియుంటిరి బ్రహ్మ సూత్రములెన్నియో!

చరమకాలము వచ్చి యుండెను సాధువర్తన లేకనే 

మఱచి పోయితి ధర్మమేదియొ మందబుద్దిగ మారితిన్ 

గరుణజూపుచు జేర దీయుమ!కన్న తండ్రిగ కేశవా!

కునుకు దీయక నీదు నామము కోరి పల్కితి నచ్యుతా!

వినుమ నామొర విన్న వించెద వేదనంతయు దీర్చుమా!

ఘనుడ వీవని నమ్మి యుంటిని గౌరవంబును జూపుమా!

మనము నందున నిల్పి కొల్చితి మాయ జేయకు మాధవా!

పదము లంటుచు నీకు మ్రొక్కితి భక్తిమీరగ

గొల్చుచున్ 

వదల నోప్రభు!నీదు సన్నిధి వందనంబులు జేసెదన్ 

సదమలంబగు బుద్ధి నీయుమ!సాధు రక్షక మాధవా!

ముదము నిచ్చి తరింపజేయుచు ముక్తి మార్గము జూపుమా!//



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics