శివశివ యనరా!
శివశివ యనరా!
ऊँ!!
🕉చంద్రశేఖర వృత్తములు🕉
న జ ర జ ర /13యతి ..
శివశివ యంచు నిన్ను పూజచేయ క్షేమమున్
శివశివయంచు నీకు బూది రాయ చిత్తమున్
శివశివయంచు ప్రీతి మల్లెలేయ చిత్రమున్
శివశివ నీదు నూర్జితంబు జూఁపు చిన్మయా !! 1
శివుడవు నందురే యిదేమిలీల శ్రీకరా!
భవుడవు నందురే సతీలలామ భాగ్యమై
కవయిత నీవు లోకమేలు రీతి కావ్యమై
తవపదమీయమంటి దేవ! కాచు త్రాతవై !! 2
నవరసయుక్త మైన నీదు దివ్య నాట్యమున్
కవనములందు జంద్రశేఖరా ! ప్రకాశమున్
భవనము మేలు గొల్పు దూర్జటీ ! శుభంబులన్
శ్రవణము జేయు మాశివాలయంబుఁ సన్నుతిన్ !! 3 ..
✍️చావలిబాలకృష్ణవేణి …
29;11;’22 Sent from my iPad
