STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

వీడ్కోలు గణేశా!

వీడ్కోలు గణేశా!

1 min
338


శివుని గారాల పట్టివి చిన్మయుండ

జగతి నంతయు బ్రోవుచు సుగతి నీయ

వచ్చి యుంటివి ముదముగా వసుధ యందు

నుత్సవంబులు చేయుచు నుఱికి నుఱికి

కుడుములుండ్రాళ్లు పెట్టుచు కూర్మి తోడ

నిన్ను గొల్చితి మయ్యరో!నెమ్మి జూపి

వరము లన్నియు కురిపించి కరుణ జల్లి

పయన మైతివి కైలాస పర్వతముకు.

వెళ్లి రావయ్య!గణపతీ!విమల హృదయ!

మదిని నిల్పుచు నీరూపు మఱచి పోక 

వత్సరంబును గడుపుచు భక్తి తోడ

దలచి కొందుము మాకుల దైవమనుచు

మరల భాద్రపదంబున మరలి రమ్ము!

వేచి యుందుము నాయకా!వినతి వినుమ!

-------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics