STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కృష్ణ లీల

కృష్ణ లీల

1 min
288


కొంటెతనమున కృష్ణుడు కూలగొట్టె

పాల కుండను చూడరే పడతులార!

చిన్ని బాలుని యల్లరి చేష్టలింక

సైప లేమమ్మ! నెలతరో!చాలు చాలు!


వెన్న ముద్దలు మ్రింగుచు వేడ్కతోడ

పాఱి పోవును గడసరి పఱుగు పెట్టి

పట్ట బోయిన మాయలో

 పెట్టి మనల

తుర్రు మనుచుండు చిన్నారి దొంగ వీడు.


వెన్నతినియొక చోట తా మన్ను తినును

వలువలను దోచు నొక చోట పడతి గాచు

పాము పైగంతు నొక చోట పశుల మేపు

వీని పనుల కర్ధంబుల వెదుక లేము.


ముద్దు చేయుచు రేపల్లె ముదితలెల్ల

వీని యాగడముల గని వెంట పడుచు

దైవ మంచును భక్తిగా తల్చు కొంద్రు

నమ్మ లేమమ్మ వీనిది నాటకంబు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics