రక్షకట్టెదము.
రక్షకట్టెదము.
ఆడపిల్లలము మేము అక్క చెల్లెళ్ళము
అన్నదమ్ములు మీరు ఆదరించిన చాలు.
చిన్ననాటి స్మృతులు చిలిపి అల్లరులు
చేసినాము మనము
చేయి చేయి పట్టి.
చెరుకుతీపి వోలె మదిలోన కదలాడు
జ్ఞాపకాలసుడులు మఱచి పోలేము.
అత్తగారింటికి అడుగు పెట్టినదాదిగా
పెద్దరికంవచ్చి మా బరువు పెంచింది.
పుట్టినింటికి మేము చుట్టాలమయినాము
చూడ వచ్చిన నాడు వీడి పోలేక
అడుగులో అడుగేసి తరలి పోయెదము.
తల్లి తండ్రి దీవెన
తలనిండుగా పట్టి
అన్న దమ్ముల ప్రేమ
కొంగులో ముడికట్టి
కంటనీరొలకగా కలవారి కోడళ్లమయి కదలి పోయెదము.
అన్నదమ్ము లారా!రండి !ఆదరమ్ముతో నేడు
రక్ష కట్టెద మయ్య లలిని జూపి.
మేము కట్టిన రక్ష మీకు తోడుగ నుండు.
జయము నొసగును మీకు
జీవనంబులో మీకు సతము మేలు కలుగు.
సకల సౌభాగ్యలు మేము పొందెదము.
సంతోషంబుతో మీరు జగతిలో వర్ధిల్ల
ఆడపిల్లల మనికి ఆనందముగ విలసిల్లు.
