STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" బ్రతుకే ఓ పందెం!"

" బ్రతుకే ఓ పందెం!"

1 min
184


ద్యూతమెరుగని జీవితంలో...

బ్రతుకే ఓ జూద క్రీడగా !

విధి శకునిలా...

కాలాన్నే పాచికలా విసరగా !


పంచిన మంచే వంచనై ముంచేయగా...

కూడుకున్న ప్రతీ జ్ఞానసంపదను

ఓడుతున్న కొద్దీ అజ్ఞానంతో నేనా పందెంలో ఒడ్డగా !

ఒడ్డి ఓడగా పడిన ప్రతీ అడుగూ అజ్ఞాతవాసాన్ని అనుసరించగా !!


ఏ కృష్ణ ధర్మం అడ్డుకోగలదో...

అంతమంటూ లేని ఈ విధి విలాపాన్ని ?

ఏ కర్మ ఫలం ఆపగలదో...

అలుపంటూ రాని నా మనోవేదనపు గమ్యాన్ని ?  


-mr.satya's_writings✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract