STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

3  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శివోహం!"

"శివోహం!"

1 min
109


ఓ ఈశ్వరా...!

బంగారు కిరీటాన్ని మోయాల్సిన నీ శిరస్సుపై

జటాజూటాలను కొప్పుగా మార్చి ఉదృత గంగనే బంధించావే !

అమృతం శ్రవించాల్సిన ఆ గొంతులో

విషాన్ని నింపి నల్లగా మార్చుకున్నావే !

కంఠాభరణాలు ధరించాల్సిన ఆ కంఠం చుట్టూ

పాముల చుట్టలతో నింపుకున్నావే !

చల్లగా చందనం పూసుకోవాల్సిన చర్మం పై

చితి బూడిదను రాసుకున్నావే !

పట్టు వస్త్రాలు ధరించాల్సిన నీ దేహాన్ని

పులుతోలుతో కప్పుకున్నావే !

శుభ్రంగా వెండికొండ కైలాసం పై కూర్చుని సేదతీరక

స్మశానంలో సంచరిస్తూ ఆత్మలకు తోడయ్యావే !

పాపవినాశన, శతృసంహారాణార్థం

త్రిశూలమనే ఆయుధాన్ని ధరించి త్రిశూలధారుదయ్యావే !

నిశ్శబ్దాన్ని బేధించి శబ్దాన్ని ధ్వనించే

ఢమరుకమనే వాయిద్యాన్ని సృష్టించి లయకారుడయ్యావే !

ఓ సోమ శేఖరుడా, ఓ తాండవ నటరాజా !

ఓ త్రినేత్ర రుద్రుడా, ఓ త్రిలోక రక్షకా ...!

సతీ వియోగ క్రోదక

పార్వతీ సమేత కైలాశ

ఆదియోగి - అఘోర,

నందీశ్వర - దిగంబర,

వీరభద్ర - విశ్వేశ్వర,

పినాకిని - పరమేశ్వర,

భూదేవ - చంద్రపాల,

దేవదేవ - హరహర మహదేవ

శివాయః శివాయః శివాయః

ఓం నమఃశివాయః !

-mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract