STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Drama Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Drama Classics Inspirational

"ద్వంద్వ ప్ర'మా'యాణాలు"

"ద్వంద్వ ప్ర'మా'యాణాలు"

1 min
10

పెళ్లి పీటలపై ఆమె !
   శవ పాన్పుపై అతను !!

నిండు గుడ్డల కట్టుతో ఆమె !
    నూలు పోగైనా లేని అతను !!

తలపై జారే తలంబ్రాలతో ఆమె !
   తనువుపై చల్లే పూలతో అతను  !!

నుదుట బాసికంతో ఆమె  !
  ఎదుట బంధుశోకంతో అతను !!

వెలుగుతున్న చూపులతో ఆమె !
   మూసుకున్న కళ్ళతో అతను !!

మనసు చంచలమై ఆనందంతో ఆమె !
    వయసు నిశ్చలమై అంతిమయాత్రతో అతను !!

అగ్ని సాక్షిగా ఏడడుగుల ప్రయాణంలో ఆమె !
     చితి మంటల మధ్య చివరి పయనంలో అతను !!

పచ్చని పందిట్లో ఆమె జీవితం మొదలు !
    శ్మశాన వాటికలో అతని బ్రతుకు తుదకు !!

పొడవైన పగటికి, నలుపైన రాత్రికి తట్టుకుంటున్నప్పుడు,
   కొత్త ఉదయం కోసం ఎదురుచూసే శక్తిని అతడు కోల్పోయాడంటారా ?

కాటికి పోయే ధైర్యమే ఉంటున్నప్పుడు,
    కడవరకూ పోరాడే తెగింపు అతడికి లేదంటారా ?

కాలం కుదిర్చిన ప్రేమ యాత్రనో ?
   విధి విడదీసిన విరహ గాధనో ?

చిన్న చిన్న కారణాలకు కుమిలిపోతూ...
అర్థాంతరంగా ఆగిపోతున్న జీవితాలెన్నో కదా !

-mr.satya's_writings✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract