"ఓటమి బలాత్కారం - విజయమనే వరం !"
"ఓటమి బలాత్కారం - విజయమనే వరం !"
కలల కట్టెలు కాలి, ఆలోచనల చలిమంటలలో
నీ యవ్వన సౌందర్యం కరిగిపోతుంటే ...
కట్టె వరకూ ప్రయాణించలేని బ్రతుకు
నీకెందుకురా బడవా అని భవిష్యత్తు ప్రశ్నిస్తుంటే
నోరువిప్పి మాట చెప్పలేని అల్పుడివి
నువ్వో వెధవా అంటూ చావు కూడా సిగ్గుతో తలదించుకుంటే
పొంచివున్న ముప్పులను గమనించక
తప్పని తిప్పలతో నావికాని తప్పులు తప్పక ఒప్పుకుని...
తప్పటడుగుల తోవనే ఎంచుకున్న నాకు...
తప్పేట్టు లేదే దినదినాన ఈ ఓటమి బలాత్కారం !
ఆ విజయమన్న వరం వరించే వరకూ ...
-mr.satya's_writings