"విరహ తాపం !"
"విరహ తాపం !"


నీ మాటల్లో మాధ్యుర్యం
నీ శుభోదయపు శుభాకాంక్షలతో ఊహించగలిగాను.
నీ అధరముల సౌందర్యాన్ని
నీ పలుకుల లాలానతో ఊహించగలిగాను.
నీ కలువ కనుల కలలను
నీ ఆలోచనలో నా స్మరణతో ఊహించగలిగాను.
నీ శ్రవణములో శబ్దాల లోతును
నీ సహనపు నిగ్రహణ శక్తిలో ఊహించగలిగాను.
నీ నున్నటి చెక్కిలి స్పర్శను
నీ కవన వాక్యాల భావముతో ఊహించగలిగాను.
వీటికి తగ్గట్టు
నీ కురులు మ
ెడమీదగా విరబూయిస్తూ...
నడుము వంపుల వరకూ ఊగుతూ ఆ మడతల్లో నాట్యం చేస్తాయన్నట్టు ఊహించగలిగాను.
ఓ చెలి...
మొత్తంగా కంటికి కనిపించని నీ నిలువెత్తు రూపాన్ని
నా ఈ కవిత్వంలో బంధీస్తూ ఊహించగలిగాను
నీ తనువును రమించ రతిక్రీడలో అనుభవమెరుగక,
తాపంతో తపిస్తున్న నా శరీరం...
నా ఊహలు నీ దేహాకృతిని అణువణువునా వర్ణించగా... అనుభవిస్తూ అల్లుకుంది నా ఈ అక్షర కావ్యం !
రచన: సత్య పవన్