తీర్థ స్నానం
తీర్థ స్నానం
ఎంత సముద్రం దాచుకొందో కన్ను
దాని భాష విలపించడం
ఎంత ప్రపంచం ఇముడ్చుకుందో గుండె
అన్నీ ఘోషలు దానివే
హద్దులు చేరిపేసే వాన కురుస్తుంటే
చేతులెందుకడ్డు పెడతావ్
ఎండకి వానకి చలికి
బయటికొచ్చి నిలబడు
ఏ మనిషి కంటే నువ్ వేరో చూడు
రక్త వర్ణాలేమైనా ప్రత్యేకంగా స్పందించాయేమో
రొట్టె కాలుస్తున్న వాసనకి
నీకు ఆకలినాడులు వేరేలా అరిచాయేమో చూడు
పిల్లందరు వేలికొసలు తాటించి పెద్ద చక్రమౌతున్నారు
వొంగి దూరిపోదాం రా!
వొంగితే ముసలితనం పోతుందని
తెల్లవారి జాము చందమామ చెప్పింది!
మనుషులమధ్య స్నానం ఓ గొప్ప తీర్ధం!
... సిరి ✍️
