STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

పాత ప్రయాణం

పాత ప్రయాణం

1 min
320

అతడి కను బొమ్మల మధ్యకు

ఛాతీ వైశాల్యమునకు

రోమాంఛితమగు భావమొకటి

చెమట చుక్కల రీతి

చోటు వెతికి ప్రవహించె


వర్ణనకు అతీతమౌ

ఆమె సంపన్న శరీరము

సురత క్రీడల పొంగి


వారిరువురూ

రసాస్వాదన గోరు మిథునమై

నవ దాంపత్యపు సిగ్గుల బుగ్గలు అరుణమై

తనువుల తాపము దాటి

సృష్టి కార్యముల నెరవేర్చు

వంశ వృక్షపు చిగుళ్లకు

ఇది ఆరంభము


వెతికి వెతికీ 

ఆనంద సందోహపు కేంద్రకములను

తనివి తీరా ప్రేమించి

రతీ మన్మథుల సామ్రాజ్యానికి

వారు అడుగులు వేసిరి


అది పాత ప్రయాణం

అనాది నుంచీ సాగిన కోరికల సమాహారం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract