STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

మహిళలు..

మహిళలు..

1 min
370

ఆకాశంలో సగం పాత మాటేమో

మహిళలు మహారాణులు

రోజూ విన్న మాటేనేమో

ఈ ఏడు మహిళా దినోత్సవానికి

కొత్త క్యాప్షన్ కావాలి

బాగా కొత్తగా ఉండాలి


కానీ

అభ్యుదయవాదం గురించి మాట్లాడితే

హక్కుల గురించి గుర్తు చేస్తే

అదే మొహం చిట్లింపులు

అసహనపు నవ్వులు


ఇంకా మేము మహారాణులం

అని చెప్పుకోవాల్సిన అవసరం మహిళలకు ఉందా

సమానత్వపు వెలుగులు చూసే వేళ

ఒకరు రాజయితే మరొకరు రాణి అవుతారు

లేదా

ఇద్దరూ ఒకే జట్టులోని సైనికులు అవుతారు


ఇదెందుకు ఆలోచించం

ఇలా ఎందుకు మాట్లాడం

స్వేచ్ఛగా బతకనివ్వని చోట

మహిళా దినోత్సవాల నిర్వహణ ఎందుకు

మాటకు విలువివ్వని సమాజం ఇచ్చే

ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు


కొంచెం ఆలోచించాలేమో 

ఇంకా చాలా మారాలేమో..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract