Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"ఓ చెలి..!"

"ఓ చెలి..!"

1 min
274


అలలా చేరిన నువ్వు కలలా మరాకా ...

కంటి రెప్పన దాగిన కన్నీరు ఉప్పెనలా పొంగింది.

ఓ చెలి...!

కనపడుతుందా నా నిట్టూర్పు !!

ఏ సమస్యలోనైనా తోడుగా నిలుస్తానన్న అనేక సందర్భాలలో నువ్విచ్చిన వాగ్దానం,

అకారణంగా దూరమయి నన్నిప్పుడు ఒంటరిని చేసింది.

ఓ చెలి...!

వినబడుతుందా నా ఆక్రందన !!

అదుపులేని నీ ఆలోచనలతో సతమతమవుతున్న

నా మెదడుతో, అలసిపోయి ఆగిపోతానంటుంది నా హృదయం.

ఓ చెలి...!

అర్థమవుతుందా నా ఆవేదన !!

నీ ప్రేమ కోసం నిశీధి వేళ భానుడినై కవితల వెలుగులు కురిపించినా,

నా ప్రేమను కరుణించ నీ కిరణాల వెలుతురును నా మదిలో నింపలేకపోయావ్.

ఓ చెలి...!

గమనించగలవా నా నిస్వార్థం !!

గడిచిపోయిన గతం ఒక జ్ఞాపకంలా మెదులుతుంటే ,

కదులుతున్న కాలంలో విగత జీవిలా పడున్నా నేను.

ఓ చెలి...!

ఊహించగలవా నా భవిష్యత్ !!

ప్రేమను గెలిపించుకోలేక ఓడిపోయానని పంచ భూతాలు

ఛీదరించుకుంటుంటే,

ఆ ప్రేమనే త్యాగం చేసి, ఓడిపోయిన ప్రేమలో గెలిచానని వాటికి సర్ది చెప్పడం నా వంతైంది.

ఓ చెలి...!

గుర్తించగలవా నా ఓర్పు !!

ఎప్పటికైనా దొరికేనా ఓ ఓదార్పు...!!!

mr.satya's_writings✍️✍️✍️



Rate this content
Log in