ఉగాది కంద పద్యాలు
ఉగాది కంద పద్యాలు
కలిసిన రుచులన్ని మనకు
తెలుపుగ జీవన గతులను తెలివగు రీతిన్
బలిమియు కలిమియు కాదుగ
సలిలము వలె నడువ వలయు సచ్చర స్ఫూర్తిన్
పూజిత యవమానములును
రోజున మన చేతలందు రూఢియగునుగా
కూజితమును వినునట్లే
రాజిల్లవలె నొకరీతి రాత్రీ పగలున్
వచ్చెగ శుభముల వత్సర
మిచ్చుగ శుభ కాంతులనిల మిళితము జేసీ
తెచ్చుగ పాడిని పంటను
మెచ్చుగ జనులిక నడువగ మేలు మనముతోన్
ఉగాది శుభాకాంక్షలతో
మీ
నాగేశ్వరరావు
