రామాయణం
రామాయణం
దత్తపది :
అరిసె, గారె, పూరి, వడ పదాలు ఉపయోగించి స్వేచ్ఛా చందంలో రామాయణార్ధంలో పద్యం వ్రాయడం :
కందం
అరిసెము నొందగ నందరు
మొరపముగా రెమ్మ విరిచె మూర్ధము కూల్చెన్
దరహాస పూరితము గా
సెరగుల గావడమె దీక్ష సీతా పతికిన్
అరిసెము=సంతోషము
మొరపము=మ్రోత
మూర్ధము=తల
సెరగు=ఆపద
