మురళీగానం
మురళీగానం
విరించి మోహనంగా
రసవత్తరంగా రూపం..
నిన్ను మోహించి సమ్మోహనంగా సంతరింపచేసిన మేనకను..
ఉన్మత్త శృంగార ఉద్దీపనం
తపించదును రమ్యంగా..
బ్రహ్మ తీర్చిదిద్దిన రూపలావణ్యడు
ప్రత్యేకించి నయన మనోహరంగా రూపుదిద్దిన మురళి గానవుడు..
అష్టాదశ పురాణాలను పుక్కిలిపట్టినంత దర్పం..
తొణికిసలాడే రవ్వంత రెచ్చగొట్టే ధరహాసం..
ఆపాదామస్తకం రవిపుత్రుడు
మేనిఛాయ మాత్రం ధగ ధగ లాడే ధవలం..
అణువణువూ అంగరంగ వైభోగం ఉట్టిపడే సుందరాంగుడు
కమనీయ రూపం కడు రమ్యం
