STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Romance Fantasy

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Romance Fantasy

బాబోయ్!ఇటురావా మళ్ళీ

బాబోయ్!ఇటురావా మళ్ళీ

1 min
296

పారిపోకు అబ్బాయ్!ప్రయాణం ఇటే మళ్ళీ

పంటచేల నువ్వు అడ్డబడివెళ్లినా,కళ్లాలకే మన కధోయ్


నవ్వమాకు చిరునవ్వాయ్!అల్లరి ఆటలు కట్టిపెట్టండి

సత్యభామ ఆనుపానులు వెతకొద్దు,రుక్మిణీ సఖిని నేనోయ్..


మాటమీరమాకు కన్నాయ్!కన్నుల కలతలు కుంగిపో"నీ"

రాక్షస సంహారానికి ఎన్ని వసంతాలు కావాలోయ్


హాస్యమాడొద్దు హతవిధీ!ఎవరిని నువ్వు తూలనాడేది

నెలపట్టిన చంద్రుడు ఒళ్ళుచేస్తూ, పండుగ ముందు అంటున్నాడోయ్


కదిలిరావాలి కులపతి!అరణ్యవాసాలకియ్ చెల్లుచీటీ

కలకంట కన్నీరు ఏరు కానీయకోయ్,ఎడబాటు రానీయకోయ్...


విడనాడాలి దళపతి!ఎందుకీ సింహాసనాలు శ్రీపతి

అంగారానికి అద్దెకుపోయినా ఆత్మీయతదే ఆధిపత్యమోయ్...



Rate this content
Log in

Similar telugu poem from Abstract