STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

వాగ్దానం

వాగ్దానం

1 min
232

వాగు(క్)దానమాత్రమే కాదు ఒకటికి మరిన్ని కలిపి

పెక్కు వరములు అక్షతలుగా శిరస్సున చల్లెన్ శివుడు

పంచభూతాత్మకమైన ప్రకృతిని తల్లివోలే చేర్చే

బెల్లమైన చింత లేదు తీయందనాల రుచి పంచు

కానీ ,పొగరుబట్టి సహజీవన దారి బట్టే

చక్కటి జీవితాన్ని వడ్డించిన విస్తరిని

కలగూరగంప కావించి ముద్ద వెగటు ఆయే

ఎదురుచూపులు వెర్రిచూపుల తోడ

ఎవరికోసమో ఆకళ్ళు వెతుకుచుండె

ఎవరో వస్తారని ఆగొద్దనే ఒకరు

వారిమాటల పెడ చెవిని పెట్టె

బానిసత్వాని బలుపని నమ్ముకుని

పూలచెరువని తలచి ఊబి ఊయలెక్కే

ఆపన్న హస్తాల జాడ ఎమోకాని

భగవంతుని జాడ ప్రకృతిని మాయమయ్యే

గుడిసె పోయి గుండ్రాయి బలము ఇల్లును కట్టే

ఇంట వాసము ఒకడు ఉండడాయే

ఆ జీతమ్ము,ఓహో జీవితమ్మనుచు

రెక్కకట్టి పలుదిక్కుల ఎగురుచుండె

నిలబడి నీళ్లొద్దు పరుగిడి పాలముద్దు

యవ్వనమున పులుసు సారము పోయే

ముదుసలి వయసొచ్చి పలకరించినవేళ

మనసు పొరల భగవానుడవవతరించే

పడవేసి వెతికేవు,వండి వలుకబోసేవు

పనికొచ్చే పని నీవు వయసుడిగాక చేసేవు

అంటిపెట్టికు ఉన్న దైవాన్ని దులిపేసి

దెయ్యాల బాటన ఏడుస్తూ వగచేవు

నీనుంచి తానడిగిన వాక్ దానమేదిరా!

నన్ను అనుసరించు నిన్ను కాచుకుంటాను

ఏం!ఊరకనే ఇచ్చు మాట సిరి కాదంటనా

ఆడుక్కుని మరీ ఆరు కూరలని మిడిసిపోయేవు



Rate this content
Log in

Similar telugu poem from Abstract