Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

" బై బై గణపయ్య ! "

" బై బై గణపయ్య ! "

1 min
6


గణపయ్యా ! ఓ బొజ్జ గణపయ్యా !!

మట్టి బొమ్మల్లో అపరిమితమైన నువ్వు !

సుద్ద ముక్కలకు పరిమితమయ్యావే ?

భక్తి గీతాలకి పరవశించే నువ్వు !

రక్తి పాటలకు ప్రాకులాడుతున్నావే ?

భరత నాట్యానికి తాండవించే నువ్వు !

అశ్లీల నృత్యాలకు డాన్స్ కడుతున్నావే ?

"గణపతి బప్పా మోరియా !" అంటే ఉప్పొంగే నువ్వు ,

"కొట్టు.. కొట్టు ... d j కొట్టు.. బాక్సూ బద్దలు కొట్టు !" అంటే ఉబ్బితబ్బిబ్బవుతున్నావే !

ఒకప్పుడు ఊరికొక్కడివై దర్శనమిచ్చిన నువ్వు,

ఇప్పుడు విధికొక్క విగ్రహమై నీ భక్తుల పట్ల దూరం పెంచితివే !!

ఓ గణపతీ...

మా జనులు, update అనే వంకతో తమతో పాటు నిన్ను కూడా ఏమార్చేసారయ్యో !

అయినా ఇన్ని రోజులూ ఇక్కడే ఉండి ఎన్ని దారుణాలు చూసావో, మరెన్ని అరాచకాలలో పాల్గొన్నావో !

ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే తల్లి పార్వతి, తండ్రి పరమేశ్వరుడు కూడా నీలో మార్పుకి భయపడాల్సి వస్తుందేమో... ?

మా ప్రజల భక్తి కాస్త, రక్తిగా మారకముందే నువ్వు మా ఈ లోకం నుండి లాగించేయవయ్యా !

ఇక సెలవయ్యా గణపయ్యా !!

బై బై గణపయ్యా !!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract