ముబారక్
ముబారక్
మైత్రి అర్థం తెలిసి కాచే మిత్రవరులకు ముబారక్ హో..!
సకల జీవుల మేలు కోరే జ్ఞాననిధులకు ముబారక్ హో..!
చంప దలచిన లోన దాగిన చంపు గుణమును చంపవలెనోయ్..!
సత్యమేదో సరిగ పంచే నిత్యతరులకు ముబారక్ హో..!
పండుగంటే దుఃఖమన్నది విశ్వమందున లేని రోజే..!
కులముమతముల గొడవ మాన్పే శాంతిప్రియులకు ముబారక్ హో..!
మౌనదీప్తుల నారగించే సాధనేదో అందుకోవలె..!
మాట విలువను పట్టి నిలిపే సరసధరులకు ముబారక్ హో..!
అన్నిపండుగ లందరొకటిగ జరుపుకొనుటే అసలు పండుగ..!
మానవత్వపు నదిగ సాగే తలపుగిరులకు ముబారక్ హో..!
