STORYMIRROR

T. s.

Abstract Fantasy Others

4  

T. s.

Abstract Fantasy Others

కాసిన్ని అక్షరాలు

కాసిన్ని అక్షరాలు

1 min
409


కాసిన్ని అక్షరాలు..

లక్షల అక్షరాల నక్షత్రాలు..

కాసిన్ని అక్షరాలు..

అంతులేని అచ్చట ముచ్చటలు..

కాసిన్ని అక్షరాలు..

వందల వాక్యాల వారధులు..

కాసిన్ని అక్షరాలు..

వరదలా వెల్లువెత్తే వాన చినుకులు..

కాసిన్ని అక్షరాలు..

పదుల పదాల పాదాల పల్లవులు..

కాసిన్ని అక్షరాలు..

వేల వెలుగుల వేకువలు..

కాసిన్ని అక్షరాలు..

అందగా అలంకరించే అధ్బుతాలు..

కాసిన్ని అక్షరాలు..

కలంలో ఒడిసి పట్టిన సిరా చుక్కలు..

కాసిన్ని అక్షరాలు..

భిన్న భావోద్వేగాల భాగాహరాలు..

కాసిన్ని అక్షరాలు..

ఝాము రాతిరి జాలువారే జావళీలు..

కాసిన్ని అక్షరాలు..

సంకెళ్లు తెంచుకున్న స్వేచ్ఛ సంబరాలు..

కాసిన్ని అక్షరాలు..

కలలకు కాపు కాసే కన్నుల కలువలు..

కాసిన్ని అక్షరాలు.. 

కాలచక్రంతో పాటు నిరంతరం కాస్తూనే ఉంటాయి..



Rate this content
Log in

Similar telugu poem from Abstract