Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"యాచకులెవరోయ్! యాచకులెవరోయ్!!"

"యాచకులెవరోయ్! యాచకులెవరోయ్!!"

2 mins
482


అడుగడుగో.... ఓ వృద్ధ పకీరు

అలసిన దేహంతో మాసిన గుడ్డలతో

భుజాన సంచినెట్టి పళ్ళెం చేత బట్టి

ధర్మం బాబు.. ధర్మం బాబు.. అంటూ ప్రాధేయపడుతుంటే

దయలేని దరిద్రులు... దానం చెయ్యాల్సింది పోయి, సిగ్గులేదా అంటూ తరిమి కొడుతున్నారు.

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

అడుగడుగో ... ఓ చిన్న బాలుడు

చెదిరిన జుట్టుతో చిరిగిన బట్టలతో

నోట వేలినెట్టి కడుపు చేతబట్టి కన్నీటిని విడుస్తూ

ఆకలన్న... ఆకలన్న ...అంటూ అర్ధిస్తుంటే

కనికరం లేని కటినాత్ములు... చేరదీయాల్సింది పోయి, చిల్లర లేదంటూ ఛీదరించుకుంటున్నారు.

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

అడుగడుగో... ఓ వికలాంగుడు

విరిగిన కరములతో కురుపుల ఒళ్లుతో

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చిపోయే వాళ్ళను ఆపుతూ

భిక్షం ప్రభు... భిక్షం ప్రభు... అంటూ బాధపడుతుంటే

బాధ్యతలేని బోకుగాల్లు.. జాలి పడాల్సింది పోయి, తమకేం పట్టనట్టు తప్పించుకుంటున్నారు.

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

కూడు లేక కుమ్ము లేక ఆకలితో అలమటిస్తున్న

వాళ్ల ఆర్తనాదాలు ఎవరికెరుకోయ్!

గూడు లేక నీడ లేక దిక్కుతోచక తల్లడిల్లుతున్న

వాళ్ల దయనీయతలు మరెవరికిపట్టునోయ్!!

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

అడుక్కునేటోడంటూ అసహ్యమేందుకోయి !

ముష్టోడంటూ దాష్టికమెందుకోయి !!

దరిద్రులంటూ నిందలెందుకోయ్ !

సోమరలంటూ హేళనలెందుకోయి !!

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

ఆకలికి అలమటిస్తున్నోల్లే కానీ, అడిగేటోల్లు కాదోయ్..!

మసకబారిన జీవితాలే కానీ, ముష్టివాళ్లు కాదోయ్..!!

దారితప్పిన బ్రతుకులే కానీ, దరిద్రులు కాదోయ్..!

జీవితమనే సంగ్రామంలో సమరయోధులే కానీ, సోమరులు కాదోయ్..!!

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

రోజూవారీ ప్రయాణంలో నాకిది సర్వసాధారణమాయే

చూసి చూసి నా హ్రుదయం చలించిపోయే

ఏదైనా చెయ్యాలనే ఆశతో నా మనసు పరితపించిపోయే

పదోపరకో దానం తప్ప నేనేం సాయపడకపోతినాయే

ఒక్కడిగా చేస్తే కూసింతే అవుతుందోయ్!

మందిగా కలిస్తేనే ఆ ఆర్తనాదాలు ఆపగలమోయ్!!

అందుకే, వాళ్ల వేదనని అక్షరాలుగా మలిచి నా ఆవేదనని వెళ్ళబుచ్చితినోయ్!

తద్వారా జనులందరని ఏకతాటిపైకి తేవాలని నాకో చిన్న ఆకాంక్షోయ్!!

అన్ని ఉన్నా క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకునేటోళ్ల కన్నా,

ఏమిలేకున్నా జీవితంతో పోరాడుతున్న వాళ్ళే మిన్నోయ్!!

కులమత ప్రాంత లింగ వర్ణ వివక్షలకి ఇచట చోటు లేదోయ్!

వీలైతే సాయం చేద్దామోయ్, కుదిరితే దానం చేద్దామోయ్!!

లంచాలు మరిగే నయ వంచకులు కాదోయ్..!!

కాస్తైనా కనికరం చూపించండోయ్..!

మానవత్వానికి పరమార్థం చెప్పండోయ్..!!

యాచకులెవరోయ్..! యాచకులెవరోయ్..!!

రచన: సత్య పవన్



Rate this content
Log in

Similar telugu poem from Abstract