Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"స్వతంత్ర భారతం..!"

"స్వతంత్ర భారతం..!"

2 mins
236



ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

ఆకలి తీర్చే రైతు కంట్లో కన్నీరు !

దోచేసే నాయకుడు నోట్లో పన్నీరు !!

కాలిన కడుపులతో అనాధ పిల్లల ఆకలి చావులు !

కడుపు నిండినా తీరని కుబేరుల ఆకలి దప్పికలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

అంతరిక్షం దాటి పెడుతున్న పరుగులు !

దారిద్ర్య రేఖ దిగువకి పడుతున్న బ్రతుకులు !!

విగ్రహాలకు కోట్లు ఖర్చు పెడుతూ ఆర్భాటాలు !

నిరుపేదలపై పన్నుల భారం మోపుతూ ఆంక్షలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

స్వదేశాల్లో ఉచిత చదువులకై పోరాటాలు !

విదేశాల్లో ఉన్నత కొలువులకై ఆరాటాలు !!

నేరస్థులకు దాసోహమంటున్న రాజ్యాధికారాలు !

బాధితులకు శాపంగా మారిన న్యాయచట్టాలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

కులాల కుంపట్లు రేపుతున్న కార్చిచ్చులు !

మతాల మధ్య రగులుతున్న విద్వేషాలు !!

వర్ణాల వివక్షతో కొట్టుకుంటున్న జనులు !

వేర్పాటు వాదంతో వీగిపోతున్న ప్రాంతాలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

రూపాయి కోసం ప్రాకులాడుతున్న నిరుపేదలు !

రుణాలు ఎగ్గొట్టి పారిపోతున్న పారిశ్రామికులు !!

మామూలుగా పనిచేయని రాజకీయ నాయకులు !

మామూళ్ళతోనే పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

నడి వీధిలో ఆడపడుచు చీర లాగే కౌరవులు !

ఎదిరించి నిలదీయలేని నిస్సహాయ పాండవులు !!

అపరాధులకు అండగా నిలిచే రాజకీయ పలుకుబడులు !

ప్రాణత్యాగం చేసే దేశ సైనికులకు కనీస వసతులు కరువు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

ఓటుకి నోటుతో ప్రజాస్వామ్యానికి పడుతున్న బీటలు !

వారసత్వపు రాజకీయాలకు పరుస్తున్న పీటలు !!

జాతియ జెండాకు తరుగుతున్న ఆదరణలు !

రాజకీయ జెండాలకు పెరుగుతున్న మర్యాదలు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

నోరున్న పండితులు నీతులు చెప్తే తిడతారు !

నోటున్న ప్రముఖులు బూతులు తిడితే పడతారు !!

పెన్ను ఎక్కుపెట్టే పాత్రికేయులకు బెదిరింపులు !

గన్ను గురిపెట్టే హంతకులకు గుర్తింపులు !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ...

పేరుకే ప్రజాస్వామ్య దేశం !

లోలోపల మాత్రం నాయకత్వ విద్వేషం !!

పైకి సైతం భిన్నత్వంలో ఏకత్వం !

లోపించిన సౌభ్రాతృత్వంలో సమానత్వం !!

ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ... !

"ఒక చెంప పై కొడితే ఇంకో చెంప చూపించు !"

అన్న మహాత్మా గాంధీ చూపిన సత్యా అహింస ద్వారాన్ని మూసేసాం !

"మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆలోచనను చంపలేరు !"

అన్న భగత్ సింగ్ ఆలోచనను చులకన చేసి చంపేశాం !

"మేల్కోండి.. చదువుకోండి.. సమాజం కట్టుబాట్లను దాటి స్వేచ్ఛను సాధించండి !"

అన్న సావిత్రీబాయి పూలే పిలుపును పంజరంలో బంధించేసాం!

"దేశం కోసం చావడానికి సాహసం చేయ్యకపోతే.. దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది?"

అన్న నేతాజీ చంద్ర బోస్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక చతికిల పడ్డాం !

"స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను !"

అన్న తిలక్ కలం నుండి జాలువారిన అక్షరాలను కాల రాసేశాం !

"ఆడదంటే అబల కాదని, ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన !" వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటాన్ని పక్కకు నెట్టేశాం !

"ప్రజలంతా ఒక్క తాటి పైకి వస్తె, ఏ ప్రభుత్వమూ పనిచేయదు !"

అన్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలను పాతి పెట్టేశాం !

ఇంకా ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణ త్యాగాలకు, వారి సిద్ధాంతాలకు నిర్మొహమాటంగా గండి కొట్టేశాం !

ఇదేనా ఇన్నేళ్ల నా ఈ స్వతంత్ర భారతం ?

- mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract