STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

4  

Sowmya Kankipati

Inspirational

ఒంటరినే

ఒంటరినే

1 min
366

ఒంటరినేే నే ఒంటరినే..

ఎప్పుడు నేను ఒంటరినే

ఎప్పటికీ నేను ఒంటరినే


ఎందరు ఉన్నా ఒంటరినేే

ఎవ్వరు లేకున్నా ఒంటరినే

సొంత వారికి అడ్డంకినే

బయటి వారికి పరాయినే

 అందుకే..

 ఒంటరినేే నే ఒంటరినే..


భరించాను ఎన్నో బాధలనే

మోసాను ఎన్నో నిందలనే

పడ్డాను ఎన్నో కష్టాలనే

చివరికి జత అనుకున్నాను కన్నీలనే

అప్పుడు కూడా..

ఒంటరినేే నే ఒంటరినే..


కోరుకున్నాను స్వేచ్ఛనే

ఎన్నడు దాటలేదు నియమాన్నే

వదులుకోవాల్సి వచ్చింది స్నేహాన్నే

దిగమింగాల్సి వచ్చింది దుఃఖాన్నే

 అలాగా..

 ఒంటరినేే నే ఒంటరినే..


నమ్ముకున్నాను కాలాన్నే

నమ్మించలేకపోయాను సత్యాన్నే

ఎదుర్కున్నాను అవమానాలనే

తగ్గించుకోలేదు ఆత్మాభిమానాన్నే 

అయినా..

ఒంటరినేే నే ఒంటరినే..


గడిపాను ఎన్నో నిద్రలేని రాత్రులనే

నేస్తాన్ని చేసుకున్నాను తలగడనే

రుమాలుగా మార్చుకున్నాను దుప్పటినే

అలవాటు చేసుకున్నాను ఈ దినచర్యనే

అందువలన..

ఒంటరినేే నే ఒంటరినే..


ఇక ఓర్చుకోలేను ఈ గాయాన్నే

తోడనుకున్నాను దేవుడినే

చేరాలనుంది ఆయన నీడనేే

వీడాలనుంది ఈ లోకాన్నే

అప్పటిదాకా..

ఒంటరినేే నే ఒంటరినే..

  

ఎప్పుడు నేను ఒంటరినే..

ఎప్పటికీ నేను ఒంటరినే..






Rate this content
Log in

Similar telugu poem from Inspirational