ఎలా చెప్పను
ఎలా చెప్పను
ఎలా ? ఎలా?? నా ప్రేమను నీకు తెలిపేది ఎలా?? నా యెదలో నిండిన ప్రేమ నీకు తెలిపేదెలా?
ఇంద్ర ధనుస్సు వంటి రాజ్యంలో లేని ఆనందం నీ ఊసుల ఊహల్లో రెట్టింపాయేను ఎలా?
కలువరేఖలు వంటి ఈ యువరాణి కనులు నీ కలలలోకంలో కనువిందాయెను ఎలా?
ఒకమారు నా ప్రేమను తెలుపగ నీ వద్దకు వచ్చా నిన్ను చూడగ నోరు పెగలక మాట మార్చా మరోమారు ప్రేమలేఖతో నీ ముందు నిలిచా ధైర్యం చాలని హృదయంతో వెనక్కి నడిచా
ఎలా ? ఎలా??
నా ప్రేమను నీకు తెలిపేదెలా? నా ప్రేమను నీకు తెలుపుటకు ఇదిగో.. పంపుతున్న పావురంతో నా ప్రేమలేఖ ...
రోజులు గడిచిపోతున్నా కాలాలు పరిగెడుతున్నా నీపై నా ప్రేమ మాత్రం పెరుగుతూనేవుంది
సూర్యాస్తమయినా వెన్నెల కనుమరుగయినా నా కనులు ప్రేమతో వెలుగుతూనే ఉన్నవి
నేను ఎదురుచూస్తూ ఉండగా... ఆ రోజు వచ్చింది. ఆ సమయం వచ్చింది..
దేవదూతలు గానాలతో ఆడుచున్నారు గుడిగంటలు సవ్వడితో మృోగుచున్నాయి తెల్లటి రెక్కల గుర్రంపై రాజులా వచ్చావు నా చేతి వేలికి నీ ఉంగరం జత పరిచావు
నా ఎదురుచూపుల ఆశ్చర్యానికి నీ ప్రేమ పంచావు నీ ఎదకు దగ్గరగా నన్ను నీ దరి చేర్చావు నీ ప్రేమస్పర్శతో నా ఎదను తేనెలో ముంచావు నా లేఖకి బదులుగా నీ మనోమాట చెప్పావు..
ఆనందం ఆశ్చర్యంతో నిండిన నా కళ్ళు ఒక్కసారిగా వెలుగుతో విరజిమ్మెను కళ్ళను నులిమి నిన్ను వెతుకుచుండగ గుర్తొచ్చే రాత్రి ఆలస్యంగా నిద్రపోయాననీ
ఓ భగవంతుడా!! మళ్ళీ చేజారిపోయెనే...
ఎలా ? ఎలా ?? ఈ తియ్యటి ప్రియస్వప్నం నిజమయ్యేదెలా ??