STORYMIRROR

Sowmya Kankipati

Romance Fantasy Inspirational

4  

Sowmya Kankipati

Romance Fantasy Inspirational

చిరకాల ప్రేమ

చిరకాల ప్రేమ

1 min
357

నా కళ్ళతో ప్రేమలో పడిన నాటి నుండి నా కళ్ళు మసగబారిన రోజు వరకు నాకు నలక పడితే చెమ్మగిల్లే నీ కళ్ళు చెప్తున్నాయి నాపై ఉన్న ప్రేమని

నేనంటే ఇష్టమని నీ భావనని భయంగా చెప్పే నాటినుండి బెదురులేకుండా మాట్లాడే రోజు వరకు నీ మాటల్లో ఉన్న గంభీరం చెప్తుంది నీకు నాపై ఉన్న బాధ్యతని

మొదటి బహుమతిగా నువ్వు పెట్టిన పట్టీలు, నా కాళ్ళ నొప్పికి నువ్వు మందు రాస్తుండగా వచ్చే మువ్వల సవ్వడి చెప్తుంది నా మీద ఉన్న అనురాగాన్ని

సరదాగా కాఫీ తాగే నాటినుండి కషాయం తాగే వయసులోనూ మురిపెంగా పెట్టే ముద్దలోని మాధుర్యం చెప్తుంది నీ చేతి కమ్మదనాన్ని

మొదటిసారి నా చేతిపై ప్రేమతో పెట్టిన ముద్దు నాటినుండి చివరి రోజుల్లో మంచంపై ఉన్నప్పుడు నువ్వు నా నుదిటిపై పెట్టే ముద్దు చెప్తుంది నాపై ఉన్న శ్రద్ధని

నా పెదవులపై చిరునవ్వు కోసం తపించే నాటినుండి ఎప్పుడైనా మూతి ముడుచుకుంటే నన్ను నవ్వించే నీ ధైర్యపు మాటలు చెప్తున్నాయి నా ఆనందమే నీ సంతోషమని            

                                                                ఎంత అదృష్టవంతురాలని నేను                  ఇంతటి అదృష్టం ఎవరికి ఉంటుంది            ఇంతటి ప్రేమ ఎవరు పొందగలరు

ఇలాంటి ప్రేమ ఈరోజుల్లో ఎక్కడ ఉంది  ఎక్కడ చూసినా అవసరాలతో నిండిన ప్రేమ                   అవసరాలకోసమే అయితే అది అసలు ప్రేమేనా   అలాంటిది నువ్వు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప దీవెన                                             

ఎన్ని జన్మలయినా నా తోడు నువ్వే  అవ్వాలని నా ప్రార్ధన

18 నుండీ 80 ఏళ్ల వయసులోనూ ఒకలాగే ప్రేమిస్తూ నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకునే నీకు నేను ఏమి ఇవ్వగలను నువ్వు నాపై చూపే అంతే ప్రేమ తిరిగి ఇవ్వటం తప్ప..


Rate this content
Log in

Similar telugu poem from Romance