STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

4  

Sowmya Kankipati

Inspirational

రంగుల మనసు

రంగుల మనసు

1 min
400

పక పకమని ముచ్చటలొలికే ఆడపిల్ల నవ్వా

పరిమళిస్తూ వికసించే అందమైన పువ్వా


ప్రేమ మమకారాలు కలిసిన అవ్వ చేతి బువ్వ

తియ్యటి మకరందాన్ని అందించే అందమైన గువ్వ


బోసి నవ్వుల బిడ్డని ముద్దాడే అపురూప తల్లి ప్రేమా

ఉరకలేస్తూ ఒడ్డుని తాకే సముద్ర కెరటమా


బాధలలో నేనున్నానంటు ధైర్యమిచ్చే స్నేహమా

చీకటిని చీల్చుకుని వెలుగునిచ్చే సూర్యోదయమా


హృదయాన్ని పులకరించే ప్రియ స్పర్శ తుల్లింతలు

చిట పటమని ఆకులపై జారే చినుకుల జల్లులు


ఆట పాటలతో గంతులు వేసే పిల్లల కేరింతలు

రెప రెపలాడుతూ ఎగిరే సీతాకోక చిలుకలు


ఆహా! ఇంతటి అందం ప్రపంచంలో ఉన్న మనుషులలోదా? ప్రకృతిలో దాగి ఉన్న అందంలోదా?

ఎటు చూసినా ప్రకృతి మానవునిలో పెనవేసుకుని ఉంది

చూస్తుంటే ఎంత చక్కగా ఉంది ఈ అందం

బంధాలు అనుబంధాలు అంటేనే ఆనందం

కానీ ఇదంతా ఒకప్పటి గతం


ఎక్కడ ఉన్నాయి ఈ అందాలు

ఎక్కడ ఉన్నాయి ఈ ఆనందాలు


ఎక్కడ చూడు అసూయ ద్వేషాలు

ఎక్కడ చూడు అవమానాలు స్వార్ధాలు

ఎందుకో ఈ అవహేళనలు

ఎందుకో ఈ అశాశ్వత భావాలు


మానవా! మేలుకో!! మానుకో! మార్చుకో!!

 

నల్లటి వేష రూపంలో ఉన్న ఆ ముసుగుని తీసేద్దాం

ఎర్రటి జ్వలలా మండే కోపాన్ని ఆర్పేద్దాం

నీలి నింగిలాగ నిర్మల హృదయంతో ఉందాం

పసుపు పూసుకున్న భానుడిలా ప్రకాశిద్దాం

కాషాయపు కిరనాల్లా ప్రేమను పంచుదాం

తెల్లటి మల్లెపువ్వులా ఆప్యాయతలు వెదజల్లుదాం

పచ్చటి పంట పొలాల్లా నవ్వులు పండిద్దాం

అప్పుడే కదా ఉంటుంది ఈ జీవితానికి అర్ధం

అందుకే ప్రతి ఒక్కరం కలిసిమెలిసి జీవిద్దాం

ప్రకృతిలో కనిపించే ఇన్ని అందమైన రంగులు మన మనసునిండా కూడా నింపుకుందాం

అసూయలు అబద్ధాలు అవమానాలు అసత్యాలు అనే రోగాలు తరిమేద్దాం అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఆనందాలు అనే రంగులు పూసుకుందాం

ఎందుకంటే అన్ని రంగులు కలిస్తేనే ఇంద్ర ధనుస్సు

అదే ఈ అందమైన రంగుల మనసు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational