నవ్విన తరుణం
నవ్విన తరుణం




ప౹౹
నిజంగా కళ్ళలో నీళ్ళు ఆ నవ్వినా క్షణం
సహజంగా వచ్చాయీ నవ్వినా తరుణం ౹2౹
చ౹౹
పడీ పడీ నవ్వానూ నేను నవ్వాపుకోలేక
మళ్ళీ మళ్ళీ నవ్వాను నవ్వునాపుకోలేక ౹2౹
గిలిగింతలు సన్నీవేశాలెన్నో సరిచూడను
చక్కిలిగింతలు సరదాలు అన్ని కూడాను ౹ప౹
చ౹౹
కడుపు చెక్కలయేలా నవ్వించారు బాగా
కడు చక్కగ ముగ్గురు నటనతో వాటంగా ౹2౹
వారంవారం ఠంచనుగా రాత్రి సమయాన
సమాహారంగ సందడే ఆ స్కిట్ల మయాన ౹ప౹
చ౹౹
జబర్ దస్త్ ప్రోగ్రాంలో ఆ హాస్యము పండి
కబురులుతో నడిపించారు నవ్వులబండి ౹2౹
విరగబడి నవ్వుతూ వీక్షించాలే విపులంగ
పగలబడి నవ్వాక కన్నీరే కద పుష్కలంగ ౹ప౹