*అక్షరం యొక్క గొప్పతనం*
*అక్షరం యొక్క గొప్పతనం*
1 min
1.1K
*************
ప్రతి అక్షరం ఓ మధురిమ లిఖితం,
ప్రతి అక్షరం ఓ కమనీయ వచనం ,
ప్రతి అక్షరం ఒక పద్యం,
ప్రతి అక్షరం ఒక సొగసైన రాగం,
ప్రతి అక్షరం ఓ గంధర్వ గానం,
ప్రతి అక్షరం నా ఎదుగుదలకు ఒక ధైర్యం,
ప్రతి అక్షరం నాలో నింపే ఉత్సాహం,
ప్రతి అక్షరం అందిస్తుంది తీయని ఫలం,
ప్రతి అక్షరం నాకు సమకూరుస్తుంది చాలా బలం,
ఇదే నా అక్షరం యొక్క గొప్పతనం,
ప్రతి అక్షరం నా కవితై,
జన చైతన్యమే నా లక్ష మై.