నా బాల్యం
నా బాల్యం


వర్షపు చినుకులు దోసిట పట్టి....పడవలు చేసిన బాల్యం..... తిరిగిరాని బాల్యం....
ఇ సుక దిబ్బల్లో....గోపురాలు కట్టిన బాల్యం.. తిరిగి రాని బాల్యం.....
మామిడి కాయల కోసం గోడలు దుకిన బాల్యం....తిరిగిరాని బాల్యం...
బడికి పొనని మారం చేస్తే అమ్మ చేతిలో దెబ్బలు తిన్న బాల్యం ....తిరిగి రాని బాల్యం...
ఆకాశాన్ని తాకలని పైకి గెంతులు వేసిన బాల్యం.... తిరిగిరాని బాల్యం....
బొంగరాల చుట్టు గింగిరాలు తిరిగిన బాల్యం.....తిరిగి రాని బాల్యం..
.......... .. ............. ...
బాల్యం లో ఉన్న అప్పుడు ప్రతి ఒక్కరూ..... అబ్బా...త్వరగా పెద్ద గా ....అయిపోతే బాగుండు....ఈ హోం వర్క్ లు.....క్లాస్ రూమ్ లూ వుండవు... నచ్చినంతా సేపు ఆడుకోవచ్చు అని ఎన్నో అనుకుంటారు....
కాని...పెద్ద అయ్యాక...ఉద్యోగాలు...పిల్లలు.... వాళ్ళ ఫీజులు.....చూసి....మళ్లీ చిన్న తనం లో కి వెళ్లిపోతే ఎంత బావుండేది అని ఆలోచిస్తారు....మనిషి మనసు నిలకడగా ఉండదు కదా...😊😊😊