STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Children

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Children

అమ్మ

అమ్మ

1 min
382

ఏమని వివరించను

ఎంతని వర్ణించను

ఎలా పోల్చను

దేనితో సరి తూచను

అమ్మా నిన్ను..!


పురిటి బాధ

పునర్జన్మ ని తెలిసినా

మరణం కంటే

మాతృత్వమే మిన్నని 

తలచిన నీకు

వందనం అభివందనం


నే గుక్క పడితే

నీ గుండె అదిరింది

నే గాయం పడితే

నీ కన్ను చెమరింది

చనుబాలతో ఆకలి తీర్చి

చలువతో ఒడిలో దాల్చి 

ఓదార్చిన అమ్మ

నీకు వందనం అభివందనం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy