STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Others Children

4  

VENKATALAKSHMI N

Tragedy Others Children

కరిగి పోతున్న జ్ఞాపకాలు

కరిగి పోతున్న జ్ఞాపకాలు

1 min
272

ఆనాటి బాల్యం

ఆటపాటలు 

అల్లరి చేష్టలు

అమ్మమ్మ బామ్మల

మాటల మూటలు

బాలమిత్ర చందమామ

బొమ్మల కథలు

ఆరుబయట

అమ్మలక్కల

కమ్మని కబుర్లు

 చెట్టు నీడన

చల్లన సాయంత్రాలు

పున్నమివెన్నెలలో

సహపంక్తి భోజనాలు

నలుపుతెలుపు

చలనచిత్రాలు

దూరదర్శన్ లో

చిత్రలహరికి 

ఎదురుచూపులు

బావిలో ఈతలు

చెరువుగట్టున

పిల్లకాలువ వెంట

పోటీనడకలు

ఆడపిల్లల జడకుచ్చులు

పూలజడల అల్లికలు

పట్టుపరికిణీల

సొగసులు

పదహారణాల

పడుచుల

హొయలు

ఏడురోజుల

పెళ్ళిసంబరాలు

పసుపు గడపన

ముత్తైదువుల 

ముచ్చటైన ముచ్చట్లు

ఎన్నో ఎన్నెన్నో

ఆ పాత మధురాలు

కాల గమనంలో

కరిగిపోతున్న 

జ్ఞాపకాల అలలు

భావితరాలకు

ఇవియే తరగని గనులు

సాంప్రదాయాల

 సొగసుల సిరులు

పతనమవుతున్న

నైతిక విలువలు

జీవనచట్రం కింద

నలుగుతున్న

మానవత్వం

పొంచివుంది ప్రమాదం

మానవజాతి వినాశనం

విలువల విలువను

తెలియజేయుటయే

తక్షణ కర్తవ్యం



Rate this content
Log in

Similar telugu poem from Tragedy