STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Children

4  

Dinakar Reddy

Abstract Drama Children

స్నేహగీతం

స్నేహగీతం

1 min
319

కల్మషం లేని హృదయాలు

కొన్ని కొట్లాటలు

వెరసి మన పరిచయాలు


పాఠశాలలు కళాశాలలు మారినా

ఫోన్ పలకరింపులు దగ్గర చేశాయి

మనల్ని దగ్గరగా ఉంచాయి


జోకులు సరదాలు

ఇవి మాత్రమే కాదు

కన్నీళ్లు అవమానాల భారాలు

చెప్పుకునేంత దగ్గర చేశాయి


స్నేహం దూరాన్ని జయిస్తుందా

ఆఫీసు బంధాల్ని దాటి వస్తుందా

ఏమో అనుకున్నా


కానీ

ఊత కర్ర కోసం వెతుక్కునే వయసులో

మళ్లీ స్నేహం మొదలయ్యింది


అసలు స్నేహానికి అంతం ఎక్కడుంది

మనసు ఆలపించే స్నేహగీతంలో అపశృతి ఎక్కడుంది



Rate this content
Log in

Similar telugu poem from Abstract