అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా


అమ్మా!
నీకు చాలా విషయాలు చెప్పాలి
కొలీగ్ తో గొడవ పడిన విషయం
జీతం డబ్బులు పెరిగిన విషయం
నాన్నకు తెలీకుండా నేను డబ్బులు పోగు చేస్తున్న విషయం.
అమ్మా!
నువ్వు చెప్తుంటే వినాలనుంది.
పక్కింటి వాళ్ళు రోడ్డు మీద వేసే చెత్త గురించి
ఈ మధ్య జరిగిన బంధువుల పెళ్ళిలో మెనూ గురించి
నా క్షేమ సమాచారాలు అడిగిన వాళ్ళ గురించి
ఈ వారం చేసిన వంటల గురించి
టీవీలో వచ్చే వంటలక్క సీరియల్ గురించి
అమ్మా!
ఆఫీసు అయిపోయాక ఇప్పుడు చాలా టైమ్ ఉన్నట్లు అనిపిస్తోంది
ముందు కూడా ఉండేది
నాకే తెలీలేదు
దానిని సక్రమంగా ఎలా ఉపయోగించాలో
అప్పుడు అన
ిపించలేదు
నీతో రోజూ మాట్లాడాలని
వారానికి ఓ రోజు మాట్లాడితే చాలు కదా అనుకున్నాను
నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడ్డానికి ఉంటావ్ అనుకున్నాను
నే బాధ పడ్డ ప్రతి సారీ నువ్వు ఓదారుస్తావ్ కదా అనే ధీమాతో ఉన్నాను
ఎప్పుడు ఆరోగ్యం బాగా లేకపోయినా
నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చు కదా అని అనుకున్నాను
కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావ్
ఎందుకు మా అమ్మను అప్పుడే నాకు దూరం చేశావ్
అని నేను నిలదీయలేను
అమ్మ లేని దేవుడు నా మాట వింటాడా
ఆ దేవుడు ఎదురైతే ఒక్కటే చెప్తాను
మా అమ్మను బాగా చూస్కో స్వామీ
నన్ను క్షమించమని మా అమ్మకు చెప్పు అని
క్షమిస్తావా అమ్మా!