మారుతున్న సంఘం
మారుతున్న సంఘం

1 min

23.6K
మారుతోంది సంఘంలో బ్రతికే తీరు,
మారుతోంది మనుషుల మనసు తీరు,
మారుతోంది లోకుల ఆలోచించే తీరు,
మారుతోంది అందరి నడవడి పనితీరు |౧|
జనాలలో లోపమవుతోంది సత్యవచనం,
మాయమయిపోయింది వారిలో పసితనం,
చేదు నిజంతో అయ్యింది కోపం ఆగమనం,
అపరాధంతో సంఘం అయ్యింది క్రూరవనం |౨|
మహనీయులకు ఇవ్వబడును తుపాకీ గుళిక,
నేరస్తులకు ఇవ్వబడును ఆదరణగల వేదిక,
ఉండెను దగ్గరున్న దేశాలను తిట్టే ప్రణాళిక,
సాధారణం అయ్యెను మతం అపప్రచార వాడుక |త్రీ|