ఇనాయకమయ్య పండగ
ఇనాయకమయ్య పండగ




జిల్లేడు ఉమ్మెత్త
21 రకాల పత్రి కోసం వేట
ఉండ్రాళ్ళు పాయసాలు
చెరకు గడలు వెలగ పండ్లు
ఇనాయకమయ్య పండగంటే
చిన్నా పెద్దా అందరికీ హడావిడి
గుంజీళ్ళు దండాలు
మ్రొక్కుతాం నీకు ఓ బొజ్జ గణపయ్య
భూగోళం మొత్తం
కంటికి కనిపించని వ్యాధితో బంధించబడింది
రావయ్యా గణేశా
అందించు నీ చేయూత
ఆరోగ్యము ఆనందము
సకల శుభములు అనుగ్రహించు
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకా!