శీర్షిక: తనకప్పుడు తెలీదు!
శీర్షిక: తనకప్పుడు తెలీదు!
తానొక స్త్రీలింగమని
జన్మకే అనర్హమెనా పిండమని
దూషిస్తారని...
తొలిగిస్తారని!
తనకప్పుడు తెలీదు...
వివక్ష అనే వస్త్రంతో
కప్పి ఉంచారని
సమానత్వం లేని జననం తనదని
అసమానతల నడుమ నలిగిపోవాలని!
స్త్రీ జీవితం
వంశావృద్ధికే పరిమితమని
వంశాన్ని నిలబెట్టే పేరుకు
పనికిరాదని...
తానెప్పుడూ ఆ ఇంటికి పరాయిదేనని!
సర్వాధికారం కట్టబెట్టి
త్యాగమనే కిరీటానికి
బానిసని చేసి
కట్టుబాట్ల పేరుతో కంచె వేస్తారని
కాచే చెట్టుగా మార్చేస్తానని!
తెలిశాక...
తానిప్పుడు మారిపోయింది!
తనకు జరిగిన అన్యాయానికి
మరో బిడ్డ బలి కాకూడదని
ఆశల జెండాను పట్టుకుని పోరాడింది...
కాకులు లాంటి కాలానికి ఎదురెళ్లి
పోరాడుతూనే ఉంది...!!
-జ్యోతి మువ్వల
