STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Children

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Children

పీవీ నరసింహారావు

పీవీ నరసింహారావు

1 min
307

పివి మొగ్గలు


క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశ స్థితిగతులను

భారత ప్రధానిగా తన చతురతతో చక్కబెట్టాడు

రాజనీతిజ్ఞుడు గా ఆయనకు ఆయనే సాటి


బహుభాషా కోవిదుడిగా అపార అక్షర సంపదతో

తన స్వీయచరిత్ర ను లిఖించి ఆదర్శమై నిలిచాడు

సుగుణశీలి పాములపర్తి విమలమూర్తి నరసింహారావు


నాటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేతనమై నిలిచి

దేశకీర్తిని తెలుగు వెలుగును నలుదిశలా చాటినాడు

మకిలి పట్టని మలినమంటని మట్టిలో మాణిక్యమయినాడు


సరికొత్త ఆలోచనలతో ప్రపంచీకరణను స్వాగతించి

స్వీయ క్రమశిక్షణతో సాగిన స్వయం ప్రకాశకుడు

స్వతంత్ర భారతావని ధృవతారగా నిలిచాడు


అచ్చతెలుగు దనం ఉట్టిపడే ఆహార్యంతో

హంగు ఆర్భాటం చూపని మౌనమే తన ఆభరణం

ప్రపంచ కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్రాన నిలిపిన మేధాసంపన్నుడు



Rate this content
Log in

Similar telugu poem from Fantasy