STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Others Children

4  

VENKATALAKSHMI N

Fantasy Others Children

స్నేహం

స్నేహం

1 min
315

నేస్తమా!నువ్వు లేవన్న నిజం

నమ్మలేని నిజంగా దహిస్తున్నది

నిన్ను ఒక కలగా భావించలేను

నీ జ్ఞాపకాల చెరసాలను వీడలేను

నీ స్నేహపు పూదోటను మరువలేను

అందంగా కలిసి కట్టుకున్న

స్నేహపు భవంతిని

అర్థాంతరంగా వదిలేసి

ఒంటరి పక్షిని చేశావు

నీతో నడిచిన గతం

నను వీడనంటుంది

నీవు లేని వర్తమానం

ఊహించనలవి కాదు

విధి ఆడిన ఆటలో

ఓడిపోయి విడిపోయాము

కానీ..

నీ స్మృతుల పరిమళాలు

మదిని తడుపుతూనే వుంటాయి

కష్టంతో కుంగినప్పుడు

దుఃఖం పొంగినప్పుడు

నీ స్మృతి వనంలో

సేద తీరి ఊరట పొందుతాను

నీవు లేవన్న నమ్మలేని నిజాన్ని

కమ్మని కలగా మార్చి

బతికేస్తాను


Rate this content
Log in

Similar telugu poem from Fantasy