STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Fantasy Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Fantasy Others

" విరహ వేదన ! "

" విరహ వేదన ! "

1 min
266


" నీ నడుము వంపుల్లో మడతలు

నాలో ఆవేశాన్ని పెంచగా ...

నీ దేహంపై జారుతున్న స్వేదపు చుక్కలు

నా దాహాన్ని తీర్చగా ...

నీ అదరముల ఎరుపు

అగ్నిలా నా తనువంతా తగలేయగా ...

నీ కనుపాపల నలుపు

చీకటిలా నా మనసంతా ఆవహించగా ...

నాలో తాపం మోహపు వాంఛతో నిన్నే స్మరిస్తూ ఉంటే ,

నీ అందం మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తూ ఉంది.

నీ తనువు పుస్తకంలో ...

నా భావోద్వేగపు అక్షరాలతో ...

కమ్మని రస విద్యల కవితొకటి చెక్కేయనా సఖియా !

ఎప్పటికీ చెదిరిపోని, ఎన్నటికీ చెరిగిపోని ఓ జ్ఞాపకంలా !! "

mr.satya's_writings





Rate this content
Log in

Similar telugu poem from Abstract