STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

టీ

టీ

2 mins
208


టీ...!


తొలి సంధ్య వేళ మత్తుని వదలగొట్టే పానీయం ఈ టీ ..!

మలి సంధ్య వేళ మదిని ఉత్తేజపరిచే ఔషధం ఈ టీ ..!!

వంటింట్లో ముచ్చట్లకు సారథి ఈ టీ ..!

ఇంటికొచ్చే అతిథులకు వారధి ఈ టీ ..!!


సువాసనతో నాసికానికి పరిమళాన్ని అందిస్తుంది ఈ టీ ..!

రుచితో నాలుకకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ టీ ..!!

వేడితో మత్తుని తరిమి కొడుతుంది ఈ టీ ..!

రంగుతో అలసటను దూరం చేస్తుంది ఈ టీ ..!!


డ్రైవర్లకు పెట్రోల్ ఈ టీ ..!

డాక్టర్లకు మెడిసిన్ ఈ టీ ..!!

ఉద్యోగులకి ముక్తి ఈ టీ ..!

విద్యార్థులకు శక్తి ఈ టీ ..!!


కొవ్వుని కరిగించి, మెదడు పనితీరు మెరుగు పరిచే బ్లాక్ టీ ..!

బరువును తగ్గించి, యవ్వనాన్ని ఉత్పాదించే వైట్ టీ ..!!

రోగనిరోధక, జీర్ణ శక్తులని పెంపొందించే బెల్లం టీ ..!

బద్దకాన్ని, కీళ్ళనొప్పులను తగ్గించే అల్లం టీ ..!!


దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే బాదం టీ ..!

దగ్గు, జలుబులను మాయం చేసే ఏలకుల టీ ..!!

నెలసరి నొప్పిని తగ్గించే లావెండర్ టీ ..!!

ఇన్ఫెక్షన్ ల బారి నుండి బయట పడేసే తులసి టీ ..!


తలనొప్పికి, కడుపు నొప్పికి దివ్యా ఔషదం పుదీనా టీ ..!

రక్తపోటుకు, కిడ్నీ స్టోన్స్ కి నివారణ మందార టీ ..!!

మూలికలు, పండ్ల సారంతో తయారయ్యే హెర్బల్ టీ ..!

శాంతంగా ఉంచుతూ నిద్రను పుట్టించే చమోలి టీ ..!!


గుండె పనితీరును వృద్ధిచేసే గ్రీన్ టీ ..!

బద్దకాన్ని తరిమికొట్టే లెమన్ టీ ..!

రక్త ప్రసరణను పెంచే మసాలా టీ ..!!

చల్లటి వాతావరణానికి చెక్ పెట్టే వేడి వేడి టీ ..!!


ఖరీదులో చీపు ఈ టీ ..!

ఉత్పత్తిలో టాపు ఈ టీ ..!!

బాధలో మందు ఈ టీ ..!

బంధువులకు విందు ఈ టీ ..!!


ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సా"టీ" ..!

మరే ఇతర ద్రావణంతో దీనికి లేదు పో"టీ" ..!!

నేటి వ్యాపారాల్లో ఇదే మే"టీ" ..!

కురిపించగలదు కాసుల్లో కో"టీ" ..!!


అమ్మైనా, అమ్మమ్మైనా ఊసులతో పాటు ఈ టీ లేకుంటే రోజు మొదలయ్యేనా ..?

గరీభైనా, నవాబైనా దమ్ముతో పాటు ఈ టీ లేకుంటే రోజు గడిచేనా ..??


                *********



గమనిక : " కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం ! " అన్న శ్రీశ్రీ పంక్తులే నా ఈ "టీ..!" కవితకు ప్రేరణ !


- mr.satya's _writings



Rate this content
Log in

Similar telugu poem from Abstract