STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

ఆ"వేదన"..!

ఆ"వేదన"..!

1 min
347

దగా పడిన గతం

నిలకడ లేని తత్వం

గమనమే లేని గమ్యం

సన్నిహితుల చేతిలో మోసం

అయిన వాళ్లు చేసిన ద్రోహం

నమ్మిన ప్రేమలో సైతం విఫలం

చేసిన త్యాగంలో మాత్రమే సఫలం

పగటితో పోట్లాడే కష్టాలు

రాతిరితో మాట్లాడే కన్నీళ్లు

వెలుతురులో దూరమయ్యే నీడ

చీకట్లో దగ్గరయ్యే ఒంటరి తోడు

పలు అవకాశాల కోసం సాగిలపడ్డాను

పరుల అవసరాలకి వాడుకోబడ్డాను

అదృష్టానికి లేదోయ్ ఏ వీలునామా

దురదృష్టానికి మాత్రమే నా చిరునామా

గతమంతా మూటకట్టుకున్న ఘనకీర్తి

దినదినాన పెరుగుతున్న అపకీర్తి

జీవించేందుకు అర్హత లేదు

మరణించేందుకు ధైర్యం చాలదు

విరిగిపోయిన మనసు

నలిగిపోయిన వయసు

పగిలిపోయిన హృదయం

అలసిపోయిన దేహం

విసిగి వేసారిన నా అక్షరాలు

విస్తుపోయి జాలువారిన ఈ వాక్యాలు

ప్రతీది ...

ఈ మధ్య తరగతి వాడి ఆవేదనలో నుండి ఉద్భవించినదే

అన్నట్టు...

ఆవేదన అంటే ఆక్రోశం మాత్రమే కాదు...!

ఆ ఆక్రోశం మాటున దాగున్న ఓ ఎడతెరిపిలేని వేదన..!!

వేదన అంటే ఏడవడం కాదు...!

ఏడవాలి అనిపించినా ఏడవలేకపోవడం...!!

పైకి చెప్పాలనుకున్నా పక్కన చెప్పుకునే వారు లేకపోవడం...!!!

చెప్పుకోలేకపోయినా అర్థం చేసుకునే తోడు దొరక్కపోవడం...!!!!

అందుకే, ఈ కవితా వేదిక నా ప్రతీ ఆ"వేదన"కొక ప్రదర్శన శాల !!!!



साहित्याला गुण द्या
लॉग इन

Similar telugu poem from Classics